Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగారం
నాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల జగదీశ్వర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లి గుంత కండ్ల సావిత్రమ్మ పేరు మీద తన సొంత ఖర్చులతో ఈ రైతు వేదిక భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైతు వేదికలు రైతుల పరిజ్ఞానాన్ని పెంపొందింప చేయడానికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండ గాని అంబయ్య గౌడ్, టిఆర్ఎస్ మండల నాయకులు చిప్పలపల్లి సోమయ్య పాల్గొన్నారు.