Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోదాడరూరల్: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ మాజీ డివిజన్ కార్యదర్శి జుట్టు కొండ బసవయ్య, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సోమపంగు రాధాకష్ణ అన్నారు. గురువారం అనంతగిరి కోదాడ మండలం గ్రామపంచాయతీ కార్మికులుతో కలిసి సిఐటియు కార్యాలయం నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డి టి ఓ దేవకర్ణ కు మెమోరాండం ఇచ్చి మాట్లాడారు. ప్రభుత్వం కార్మికులకు 8500 రూపాయలు జీతం పెంచిన దగ్గర నుండి పని భారం కూడా పెంచిందన్నారు. కామాటి, బిల్ కలెక్టర్, ఎలక్ట్రిషన్, పంపు ఆపరేటర్, అటెండర్ ,వాచ్ మెన్ ఉన్న పేర్లను తీసివేసి అందరిని మల్టీపర్పస్ ఉద్యోగులుగా పేరు పెట్టి వెట్టిచాకిరి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన సంవత్సరానికి రెండు జతల బట్టలు, కాస్మోటిక్స్ అనగా చెప్పులు, కొబ్బరి నూనె, టవలు గ్రామ పంచాయతీలు ఇవ్వడం లేదని అన్నారు. గ్రూప్ ఇన్సూరెన్స్ ఇంతవరకు అమలు చేయలేదు. పంచాయతీ కార్మికుల పై ప్రజా ప్రతినిధులు దాడులు చేస్తున్నారు. వాటిని నిరోధించాలి. మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ముత్యాలు, సిఐటియు జిల్లా కోశాధికారి రాంబాబు, ఉయ్యాల నరసయ్య, గ్రామపంచాయతీ కార్మిక విభాగం కోదాడ మండల అధ్యక్షులు బాబు, అనంతగిరి మండల అధ్యక్షులు సత్యనారాయణ, గుండు సురేష్, జిల్లా నాగేశ్వరరావు, శ్రీనివాస చారి ,శారద, లింగయ్య పాల్గొన్నారు.