Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో భవనంలో ఎంపీపీ మని మధె సుమన్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలు పట్టణాలుగా తయారు కావాలన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. వానాకాలం ధాన్యాన్ని ప్రతి ఒక గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. యాసంగి లో ధాన్యం కొనుగోలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాల వల్ల కొనలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, నల్లగొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, తహసీల్దార్, నాగార్జున్ రెడ్డి, సింగిల్విండో చైర్మన్ కల్వకుంట్ల నాగరత్నం రాజు, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచుల ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కరెంటు బిల్లులు కట్టలేక పోతున్నాం సర్పంచులు....
గ్రామాలలో కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయని గ్రామ పంచాయతీ నిధులు కరెంటు బిల్లు లకె సరిపోతుందని బిల్లులు తక్కువ వచ్చేటట్టు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల సర్పం చులు సర్వసభ్య సమావేశంలో వాపోయారు.
ఎమ్మెల్యే, వైస్ ఎంపీపీ వాగ్వాదం....
సర్వసభ్య సమావేశంలో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వైస్ ఎంపీపీ జిల్లె పల్లి పరమేష్ మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతారం, కొత్తపెలి, జి చెన్నారం గ్రామాలలో మిషన్ భగీరథ పనులు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయని మిగతా పనులు వెంటనే పూర్తిచసిప్రజలకు తాగునీరు అందించాలని వైస్ ఎంపీపీ పరమేష్ అధికారులను నిలదీయగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చొరవ చేసుకొని అన్ని గ్రామాలలో మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాయని ఎరు నువు కూర్చో అని వైస్ ఎంపీపీ ని అనడంతో సమావేశంలో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.