Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్ల జెండాలతో అఖిల పక్ష నాయకుల నిరసన
నవతెలంగాణ-సూర్యాపేట
లఖింపూర్ కేరి ఘటనకు బాధ్యులైన కేంద్ర మంత్రి అజరు మిశ్రాను బర్తరఫ్ చేయాలని, దేశ రైతాంగానికి తీరని నష్టం కలిగించే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ ,తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్ ,సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ (చంద్రన్న) జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్, సిపిఐ జిల్లా నాయకులు మూరగుండ్ల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా. మంగళవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద వామపక్ష పార్టీలు ,ప్రజా సంఘాలు, తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ లఖింపూర్ కేరి మరణకాండతో మరణించిన రైతు కుటుంబాలతో పాటు గాయపడిన వారికి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలు తెచ్చిందని విమర్శించారు. రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలు, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు,కేంద్ర విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల మద్దతు ధరకు గ్యారెంటీ చట్టం తేవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ ,సిపిఐ ఎంఎల్ (రామచంద్రన్ వర్గం) రాష్ట్ర అధికార ప్రతినిధి బుద్ధ సత్యనారాయణ, బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి చామకూరి నరసయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి,డివైఎఫ్ఐ జిల్లా నాయకులు జిల్లాపల్లి నరసింహారావు, బోయిల నవీన్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జంపాల స్వరాజ్యం, జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, సీఐటీయూ జిల్లా నాయకులు మేకన బోయిన శేఖర్ , న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కాకి మోహన్ రెడ్డి, కారంగుల వెంకన్న ,పోల బోయిన కిరణ్ కుమార్, కునుకుంట్ల సైదులు, ఎల్లయ్య, న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం నాయకులు ఆరుట్ల శంకర్ రెడ్డి పాల్గొన్నారు.