Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
నవంబర్ 17 18 19 తేదీల్లో నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే నల్లగొండ సీపీఐ(ఎం) జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల పిలుపునిచ్చారు. గురువారం శాలిగౌరారం మండల కేంద్రంలో మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా సాకుతో ప్రైవేటీకరణ విధానాలను వేగవంతం చేస్తుందన్నారు. రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చి ప్రజలపై బారాలు మోపిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మారోజు చంద్రమౌళి, మండల కార్యదర్శి చల్ల కానీ మల్లయ్య, నాయకులు జగన్, లింగయ్య, ఎర్ర రమేష్ పాల్గొన్నారు.