Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరూ అదష్టంగా భావించండి
- నరసింహ సన్నిధిలో మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి స్వామి ఆలయ విమాన రాజగోపురానికి బంగారం సమర్పించుకోవడం అదష్టంగా భావించాలని, ఇంకా భక్తులు తమకు తోచిన విధంగా బంగారం సమర్పించుకోవచ్చని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం మంత్రి కుటుంబ సమేతంగా వచ్చిన సందర్భంగా ఆలయంలోని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ పూజారులు వారికి ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి వెంట వచ్చిన భక్తుల ద్వారా సుమారు రూ. కోటీ 83 లక్షల సమకూర్చినట్టు ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. కోట్లు వెచ్చించి కష్ణా శిలల రాయితో యాదాద్రి ఆలయం పునర్ నిర్మించడం కీర్తించదగిదని మంత్రి కొనియాడారు. తన నియోజకవర్గ ప్రజలు, కుటుంబ సభ్యుల పక్షాన ఆయన ఈ సందర్భంగా 50 లక్షలు అందజేస్తున్నానని వెల్లడించారు. ఆలయ విమాన రాజ గోపురానికి బంగారం సమర్పించుకోవడం పూర్వజన్మ సుకతంగా భావించాలని తెలిపారు. 2022 మార్చి 28న పెద్ద ఎత్తున యాదాద్రిలో ఉద్ఘాటన యాగం జరపడం తెలంగాణకే గర్వకారణమని పేర్కొన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం గొప్ప విషయమన్నారు. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులను ఆహ్వానించి ఉద్ఘాటన యాగం నిర్వహించడం చారిత్రాత్మకమే అవుతుందని వ్యాఖ్యానించారు. యాదాద్రి స్వామి తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని ఈ సందర్భంగా మంత్రి వేడుకున్నారు.