Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ జాతీయ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి
నవతెలంగాణ -నల్లగొండ
రాజ్యాధికారం వచ్చినప్పుడే బీసీలకు గౌరవం పెరుగుతుందని బీసీ జాతీయ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ ఆడిటోరియంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలకు చట్ట భద్రత తీసుకొచిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని అన్నారు. బీసీల పోరాటాల ఫలితంగానే మోడీ ప్రభుత్వం బీసీ కమిషన్ నిర్మించిందని పేర్కొన్నారు. కమిషన్ ఏర్పడిన తర్వాత గత 20 నుండి 30 సంవత్సరాల క్రితం భూములు ఉద్యోగాలు కోల్పోయిన బీసీ బాధితుల సమస్యలు పరిష్కరించాలన్నారు. గత రెండు సంవత్సరాల నుండి ఇప్పటివరకు 2000 దరఖాస్తులు కమీషన్‌కు వచ్చాయని అందులో 740 బాధితుల సమస్యలు పరిష్కరించామన్నారు. మోడీ ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీల చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేశాడని అని తెలిపారు. చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్లే బీసీలు వెనకబడి పోయారని తెలిపారు. బీసీ కులాల లో చైతన్యం లేకపోవడం వల్లే బీసీలు వెనకబడి పోయారన్నారు. అనంతరం అన్ని బీసీ కులాల సంఘాలు ఆచారి ని ఘనంగా సన్మానించారు. వైద్యం వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదిగో ని శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర నాయకులు జిల్లా ఇంచార్జ్ ప్రదీప్, వివిధ సంఘాల నాయకులు దుడుకు లక్ష్మీనారాయణ, కొల్లేటి ప్రభాకర్, రామోజీ షణ్ముఖ, సిరి వేలు వెంకటపతి, నేలపట్ల రమేష్, చక్ర హరి రామ రాజు పాల్గొన్నారు.