Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-కట్టంగూర్
వానాకాలం వరి కోతలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని వెంటనే కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజుల దీక్ష కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు వాటిని అమలు చేయడం లేదన్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మండలంలో ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం చేపట్టలేదని మండలంలో అనేక సమస్యలు తిష్ట వేశారని అన్నారు. కార్యక్రమం లో మండల కార్యదర్శి పెంజర్ల సైదులు,దండేంపల్లి శ్రీను, గుడుగుంట్ల రామక్రిష్ణ, పొన్న శాంతి కుమార్, శాఖ కార్యదర్శులు చిట్టి మల్ల ముత్యాల, గద్దపాటి యాదయ్య, కొరివి దుర్గయ్య, పెంజర్ల కష్ణ, జాల ఆంజనేయులు,గోలి స్వామి, ప్రజా సంఘాల నాయకులు శివ శంకర్, యనమల ప్రవీణ్, గంజి సాయి, వంగూరి విజరు, గద్దపాటి సుధాకర్ పాల్గొన్నారు.