Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
- కేవలం రూ.150 కోట్లు ఖర్చు చేస్తే జిల్లాకు సాగునీరు
- విలేకర్ల సమావేశంలో సీపీఐ(ఎం)కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ -భువనగిరిరూరల్
రైతు వ్యతిరేక చట్టాలు విషయంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విమర్శించారు.జిల్లాలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట 48 గంటల మహాధర్నా, వంటావార్పు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ధ్యాం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ గేం ఆడుతోందన్నారు. నల్ల చట్టాలను వ్యతిరేకించడంలో పార్లమెంటులో వ్యతిరేకించినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడం లేదని, పత్రికా ప్రకటన పరిమితమైందని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు ధాన్యం కొనుగోలు విషయంలో దొంగ నాటకాలు ఆడుతునరని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయొద్దని చెప్పిందని టీిఆర్ఎస్ నాయకులు చెబుతుంటే, బీజేపీ నాయకులు ధాన్యం కొనుగోలు చేయాలని ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. జిల్లాలో అనేక రకాల ప్రజా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు.ప్రధానంగా బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్ ల విషయంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోయిందన్నారు. భువనగిరి జిల్లాలో బునాదిగాని కాల్వ, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి పల్లి బొల్లేపల్లి కాల్వలకు రూ. 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే జిల్లా రైతాంగానికి సాగునీరు అందుతుందన్నారు. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా టీిఆర్ఎస్ ప్రభుత్వం చేయకపోవడం వల్లనే ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్వచ్ఛందంగా ఈ మహాధర్నాలో పాల్గొరని తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో అధికార విపలక్షాలు పెడుతున్న ఖర్చుతో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజల సమస్యలు అన్నీ పరిష్కరించవచ్చునని పేర్కొన్నారు. చివరకు ప్రజలు మాకు డబ్బులు ఇవ్వలేదని ఆందోళన చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, భట్టుపల్లి అనురాధ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జిల్లా అభివద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
యాదాద్రిభువనగిరి జిల్లా ఏర్పాటు అనంతరం ఐదేండ్ల కాలంలో జిల్లాలో ఏమాత్రం అభివద్ధి చేశారో బహిరంగ చర్చకు నలుగురు ఎమ్మెల్యేలు సిద్దమా అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ సవాల్ విసిరారు. జిల్లాలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట 48 గంటల మహాధర్నా, వంటావార్పు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా ప్రజలు ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని, వారికి సాగు నీరు అందించే చిన్న నీటి వనరుల విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పగలరా అని ప్రశ్నించారు. గంధమల్ల ప్రాజెక్టు ద్వారా ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నారని.. గంధ మల్ల ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో గడువును ప్రకటించగలరా అని ప్రశ్నించారు. జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తిచేసిన ఎందుకు పేదలకు పంచడం లేదని ప్రశ్నించారు. భువనగిరి పట్టణంలో రోడ్డు వెడల్పులో అనేక మంది పేద చిరువ్యాపారులు తమ జీవనాధారానికి కోల్పోతుంటే వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా మొండిగా వ్యవహరించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో రాచకొండ (నారాయణపురం) పోచంపల్లి, ఇంద్రపాలనగరం, రాయగిరి, కొలనుపాక , పర్యాటక ప్రాంతాలుగా వెంటనే అభివద్ధి చేయాలని డిమాండ్ చేశారు. మూసీ నది ప్రక్షాళన ఎప్పుడు చేస్తారో ఎమ్మెల్యే గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఖాళీగా ఉన్న డిసిఎల్ పోస్టును వెంటనే భర్తీ చేయాలని, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 26 రోజుల పాటు నిర్వహించిన పాదయాత్ర ద్వారా వచ్చిన సమస్యలను దరఖాస్తులను జిల్లా కలెక్టర్కు అందజేసినా ఏమాత్రం స్పందించడం లేదన్నారు. డిసెంబర్లో నిర్వహిస్తున్న జిల్లా మహాసభలో ఈ సమస్యలపై మరిన్ని పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు. లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు, మాటూరి బాలరాజు, బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, బొల్లు యాదగిరి,సిర్పంగి స్వామి, మాయ కష్ణ, అన్న గంటి వెంకటేశం, భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, బీబీనగర్ మండల కార్యదర్శి బండారు శ్రీరాములు, గుండాల మండల కార్యదర్శి మద్దేపురం రాజు, యాదగిరిగుట్ట మండల కార్యదర్శి బబ్బురి పోశెట్టి, తుర్కపల్లి కార్యదర్శి జహంగీర్, ఆత్మకూరు కార్యదర్శి వేముల బిక్షం, ఆలేరు కార్యదర్శి ఎండి ఎక్బాల్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వనం రాజు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశం, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు