Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ -నల్లగొండ
ఐకేపీ వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ. 21వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఐకెపి వీఓఏఉద్యోగుల సంఘం సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ డీఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్డీఓపీడీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2002సంవత్సరం నుండి మహిళా సంఘాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుకు ఎంతో కషి చేస్తున్న ఐకేపీ వీవోఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమ ప్రదర్శిస్తుందన్నారు. వారిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఎస్‌హెచ్‌జి లైవ్ మీటింగ్‌లను రద్దు చేయాలని, గ్రేడింగ్ విధానాన్ని ఆపాలని, డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు ముదిగొండ రాందాస్, కేతావత్ శరత్ కుమార్, ఎస్కే సైదాబి, ఆదామ్,జంగయ్య, జగదీష్, సుజాత, మేఘమాల, సైదమ్మ, విజయరాణి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.