Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు వెడల్పు పనులను అడ్డుకున్న నాయకులు
- అరెస్టు చేసి బీబీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు
నవతెలంగాణ -భువనగిరి
రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా వ్యాపార వాణిజ్య, గహ, చిరువ్యాపారులకు ఆస్తినష్టం తగదని వారికి ప్రత్యామ్నాయం చూపిన తర్వాత రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ , సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ిమెడికల్హాల్ వద్ద రోడ్డు వెడల్పు విస్తీర్ణంలో డబ్బాలను, ఇండ్లను కూల్చివేయడాన్ని కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, పట్టణ అధ్యక్షులు బిసుకుంట్ల సత్యనారాయణ, సీపీఐ(ఎం) నాయకులు మాయకృష్ణ, బందెల ఎల్లయ్య అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది జేసీబీలను పెట్టి చిరు వ్యాపారులను, కార్మికులను భయభ్రాంతులకు గురి చేయడం బాధాకరమన్నారు. రోడ్డు వెడల్పు లు నష్టపోతున్న వారికి అధికారులు ప్రత్యామ్నాయ చూపించాలని కోరారు . జెసిబి పనులు అడ్డుకోవడంతో పోలీసులు అక్కడకు చేరుకొని కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి బీబీ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అరెస్టయిన వారిలో వ్యాపారులు లింగ నరసింహారావు, మంచికంటి కష్ణమూర్తి,దాచ లక్ష్మీనరసయ్య, ఎలగందుల రాము, నాయకులు కైరం కొండ వెంకటేష్, వడిచర్ల కష్ణ యాదవ్, కోళ్ల గంగాధర్, పడిగెల ప్రదీప్ ఉన్నారు.