Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, రైతులు, గీతకార్మికులు
- బ్రిడ్జి ఏర్పాటు చేయాలని డిమాండ్
నవతెలంగాణ -ఆలేరు రూరల్
ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామ సమీపంలో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు, రైతులు, గీతకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొల్లూరు గ్రామంలో 3000 జనాభా ఉంది. గ్రామ పంచాయతీకి రెవెన్యూ పరిధి నాలుగు గ్రామాలు మందనపల్లి, శర్బనపురం,కొల్లూరు,తూర్పుగూడం గ్రామాలకు కొల్లూరు కేంద్రం ఆలేరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరు గ్రామం నుండి మాటూరు శర్బనపురం గ్రామంతో పాటు చుట్టుపక్కల ఐదారు గ్రామాలకు ఈ రోడ్డు వెంబడి ప్రయాణికులు వెళ్లాల్సి ఉంది. రైతులు, గీత కార్మికులు బావులవద్దకు వెళ్లాంటే, కల్లుగీయాలంటే వాగుదాటి వెళ్లాలి. ఈ వాగు 20 ఏండ్ల నుండి ప్రవహించలేదు. వర్షాలకు నాలుగునెలలుగా ఈ వాగు రహదారిపై ప్రవహిస్తుండడంతో బ్రిడ్జిలేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రైతులు చుట్టూ 30 కిలోమీటర్లు తిరిగి ప్రయాణం చేయాల్సి వస్తోంది. సుమారు 600 మీటర్లు ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నా పట్టించుకునేవారే లేరు. గీత కార్మికులు తాటి చెట్టు ఎక్కడానికి వెళ్లాలంటే ఆలేరు ,వంగపళ్లి ,మోట కొండూరు, మాటూరు, మీదుగా వెళ్లాల్సి వస్తోంది. వాగుపై బ్రిడ్జి నిర్మించినట్టయితే ఇబ్బందులు తీరుతాయని రైతులు, గీతకార్మికులు పేర్కొంటున్నారు.
బ్రిడ్జి ఏర్పాటు చేయాలి: వైస్ ఎంపీపీి గాజుల లావణ్య
పెద్దవాగు ప్రవహిస్తుం డడంతో రెండేండ్లుగా ప్రజలు, రైతులు, గీత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలల కిందట గీత కార్మికుల ను దష్టిలో ఉంచుకొని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఉపేందర్‌రెడ్డి సొంత నిధులతో ఒడ్డునుండి అవతలి ఒడ్డుకు తాడు ఏర్పాటుచేశారు. అధికారులు ప్రజా ప్రతినిధులు వారిని దష్టిలో ఉంచుకొని బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి.
భయపడుతూ వాగు దాటుతున్నా: పచ్చిబట్ల రాజు గీత కార్మికుడు
నాలుగు నెలల నుండి వాగు ప్రవహిస్తుండడంతో రోజు భయపడుతూ దాటుతున్న. సుమారు 150 మంది గీతకార్మికులు ఉండగా రోజు రెండు పూటలు తాటి చెట్టు ఎక్కడానికి పోవాలంటే వాగు దాటాలి. నెల కిందట సైకిల్ లు బండ్లు వాగులో పడి కొట్టుకుపోయాయి. ఒకరికి ఒకరం పట్టుకుని వాగు దాటుతున్నా ం.ప్రభుత్వాలు ఎన్ని అధికారంలోకి వచ్చినా మా కష్టాలు తీరడం లేదు. వాగుపై బిర్జి నిర్మిస్తే మా కష్టాలు తొలగిపోతాయి.