Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రామన్నపేట
వరి సాగుపై టీఆర్ఎస్ మంత్రుల ద్వంద వైఖరి, బీజేపీ నాయకుల దొంగ దీక్షలను, కుట్రలను రైతాంగం అర్థం చేసుకోవాలని రైతు సంఘం జిల్లా అద్యక్షుడు మేక అశోక్ రెడ్డి, మండల కార్యదర్శి బోయిని ఆనంద్ కోరారు. శుక్రవారం స్థానిక కేజే భవన్లో నిర్వహించిన ఆ సంఘం సమావేశం లో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి నీరంజన్ రెడ్డి వరి సాగు చేయకూడదంటూ ప్రకటన చేస్తుంటే, హుజురబాద్ ఎన్నికల సభలో మంత్రి హరీష్ రావు వరి వేసుకోండని పిలుపునివ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి వరి పంట సాగుచేస్తే గింజ కూడా కొనబోమని రైతులను మోసం చేయడం, గందరగోళానికి గురి చేయడం కాదా అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతులను చంపుతూ, మరో వైపు బీజేసీ అద్యక్షుడు బండి సంజరు రైతు దీక్ష చేస్తూ నటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతులను వాహనాలతో తొక్కించి చంపుతుంటే స్పందించని బీజేపీ నాయకులు ఇప్పుడు ముసలికన్నీరు కారిస్తే రైతులు నమ్మరు అన్నారు. పూటకొక మాట మాట్లాడే టీఆర్ఎస్ నాయకులు రాష్ట్రానికొక్క విదంగా వ్యవహరించే బిజేపి నాయకుల కుట్రలను ప్రజలు ప్రతిఘటిస్తూ గ్రామాలల్లో వ్యవసాయ అధికారులు నిర్వహించే సదస్సులను అడ్డుకుని నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. రామన్నపేట మండల వ్యాప్తంగా వరి పంట వద్దన్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జీపు జాత నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జల్లెల పెంటయ్య, రైతు సంఘం మండల అద్యక్షులు గన్నెబోయిన విజయభాస్కర్, కందుల హనుమంతు, గాదె నరేందర్, పులి భిక్షం, బావండ్లపల్లి బాలరాజు, బెడిద లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.