Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలనిడిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం మార్కెట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ మాట్లాడుతూ అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున అధికారులు వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. అనంతరం మార్కెట్ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం,మాజీ సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవ రెడ్డి, కౌన్సిలర్ గాజుల సుకన్య, నాయకులు లింగాల వెంకన్న, గార్ల పాటి రవీందర్, గుణగంటి రాజు గౌడ్, బోపని యాదగిరి, బూతుకురి వెంకటరెడ్డి, యూసుఫ్, దేవికా, ధనమ్మ, రైతులు పాల్గొన్నారు.