Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-అర్వపల్లి
బాధ్యతగా పోలీసులు విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించాలని ఎస్పీ ఎస్.రాజేంద్ర ప్రసాద్ అన్నారు.గురువారం రాత్రి ఆయన మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మి కంగా సందర్శించి రికార్డును పరిశీలిం చారు. వివరాలను అడిగి తెలుసు కున్నారు.పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండి అక్రమ వ్యాపారాలను అడ్డుకోవాలని ఆదేశించారు.అదేవిధంగా యువతకు చెడు అలవాట్లను అలవాటు కాకుండా ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాల న్నారు.గంజాయి వల్ల నేడు చాలామంది జీవితాలు నాశనమవుతున్నాయని అందుకు బాధ్యతగా పనిచేసి మన యువతను, సమా జాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.అందుకు ప్రత్యేక కషి అందించాలన్నారు.జిల్లాను గంజాయిరహితంగా తీర్చిదిద్దాలన్నారు.ప్రత్యేక నిబద్ధతతో పని చేసి పోలీసులు ప్రమోషన్లు,రివార్డులను అందు కోవాలన్నారు.ఈ సమావేశంలో ఎస్సై మహేష్, ట్రైనీ ఎస్సై, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.