Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేములపల్లి
రైతులకు మద్దతు ధర అందించడంలో అధికారులు, పాలకుల చర్యలు శూన్యమని వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధన శశిధర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె విలేకరతో మాట్లాడుతూ రైతుల ధాన్యానికి రూ.1960 మద్దతు ధర ఉండగా మిల్లర్స్ మాత్రం రూ.1600 నుండి రూ.1750 వరకు మాత్రమే ధర చెల్లిస్తున్నారన్నారు.మద్దతు ధర కోసం మిల్లర్లతో అధికారులు సమావేశం నిర్వహించారు.ఒక లోడు ధాన్యంపై రైతులకు రూ.10వేల నుండి రూ.13 వేల నష్టం వాటిల్లుతుందన్నారు. ధర తగ్గుదలతో పాటు హమాలీచార్జి, గుమస్తా రుసుము, సీసీపేరుతో మరికొంత దండుకుంటున్నారన్నారు. ట్రాక్టర్ లోడుకు 30 కేజీల తరుగు తీసుకుంటున్నారన్నారు.మిల్లర్లు రైతులకు మద్దతు ధర అందించడంలో అధికారుల ఆదేశాలు నిర్లక్ష్యం చేయడంలో అంతర్యం అర్ధం కావడం లేదన్నారు.రూ.1800 రూపాయలు ధర తగ్గకుండా కొనుగోలు చేయాలని, అదనపు ఖర్చులు వసూలు చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.