Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుర్రంపోడు
సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు.శుక్రవారం ఆయన మండలంలోని పిట్టలగూడెం గ్రామంలోని ప్రతిపాదిత మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల భవనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేశారన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షులు మంచికంటి వెంకటేశ్వర్లు, పీడీ రాజ్‌కుమార్, ఆర్ఎల్సీ చంద్రకళ, ఎంపీడీఓ సుధాకర్, తహసీల్దార్ కె.సంఘమిత్ర, సర్పంచ్ పోలే రాములమ్మ రామచంద్రం, ఎంపీటీసీ చంద్రమౌళి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గజ్జల చెన్నారెడ్డి ,ఉపాధ్యక్షులు వెలుగు రవి, సర్పంచులు మస్రత్ జః సయ్యద్‌మియా, చక్రవర్తి, యాదగిరిరెడ్డి, రేణు, శ్రీరామలింగం, ఉపసర్పంచ్ పగిళ్ల లాలయ్య పాల్గొన్నారు.