Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
పోలీస్ అమరుల ప్రాణత్యాగం వెలకట్టలేనిదని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా శుక్రవారంరాత్రి జిల్లాకేంద్రంలో పోలీసు అమరుల సంస్మరణ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల దినోత్సవం అక్టోబర్ 21న ు పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.అందుకు వారి సంస్మరణ, స్ఫూర్తి,శాంతి ర్యాలీ నిర్వహిం చామన్నారు.రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ అరాచకశక్తులను ఏరివేయడంలో పోలీసులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేస్తున్నారన్నారు.శాంతిభద్రత రక్షణలో అమరులైన పోలీసు కుటుంబాలకు ఎల్లవేలలా ఆదు కుంటామన్నారు.గంజాయిరహిత జిల్లాగా మార్చడం కోసం కషి చేస్తామన్నారు. అంతకుముందు జిల్లాలోని తిరుమలగిరి పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ శాంతి భద్రతల రక్షణలో నక్సల్ తూటాలకు ప్రాణాలు కోల్పోయిన బడేసాహెబ్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఎలాంటి సమస్య ఉన్నా అన్నివిధాలుగానూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఏప్రిల్ 1, 2015 రాత్రి సెమి ఉగ్రవాదుల దాడిలో అమరులైన మహేష్, లింగయ్యలు ప్రాణాలు కోల్పోయిన హైటెక్ బస్టాండ్ ప్రాంతం వరకు ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తులు వెలిగించి అమరులకు నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో డీిఎస్పీ మోహన్ కుమార్,సీఐలు విఠల్ రెడ్డి, శ్రీనివాస్, రాఘవరావు, ఆర్ఐలు గోవిందరావు, నర్సింహారావు,శ్రీనివాస్, ఎస్సైలు పడిశాల శ్రీనివాస్, లవకుమార్, విష్ణుమూర్తి, నరేందర్, బాసు,జహంగిర్, పోలీస్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచందర్, సిబ్బంది పాల్గొన్నారు.
కోదాడరూరల్ : శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కొవ్వొత్తులతో నివాళులర్పిస్తూ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొ న్నారు.ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.అనంతరం బస్టాండ్లో గాంధీ విగ్రహం ముందు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు, సీఐలు నర్సింహారావు, శివరామిరెడ్డి, ఎస్సైలు రాంబాబు, నాగభూషణం,సాయిప్రకాష్, క్రాంతి కుమార్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పంది తిరుపతయ్య, వాలీబాల్ జాతీయ క్రీడాకారుడు పందికల్యాణ్, నాయకులు గంధం పాండు, కిట్స్ మహిళా కళాశాల విద్యార్థులు, పోలీసులు, పాల్గొన్నారు.