Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గైర్హాజరైన ఐదుగురు వార్డు సభ్యులు
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
మండలపరిధిలోని ఏపీలింగోటం ఉపసర్పంచ్ కొరవి శివాజీపై గ్రామపంచాయతీ సర్పంచ్ నూకలశంకర్,వార్డు సభ్యులు అవిశ్వాసం పెట్టాలని అధికారులకు ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. పాలకమండలి ఫిర్యాదు మేరకు శుక్రవారం ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి సమక్షంలో అవిశ్వాసం పెట్టారు. వార్డు సభ్యులు రమేష్‌తో పాటు మరో ఐదుగురు అవిశ్వాసానికి సమయానికి అరగంట ముందు క్యాంప్ నుండి ప్రత్యేక వాహనంలో గ్రామ పంచాయతీకి చేరుకున్నారు.అవిశ్వాసంలో సర్పంచ్ నూకలశంకర్, ఆరుగురు వార్డు సభ్యులు హాజరై ఉపసర్పంచ్‌కు వ్యతిరేకంగా చేతులెత్తే పద్ధతిన ఓటేశారు.దీంతో శివాజీపై అవిశ్వాసం నెగ్గినట్టు ఆర్డీఓ ప్రకటించారు.ఓటింగ్‌కు హాజరైన వారిలో సర్పంచ్ నూకల్ శంకర్, వార్డుసభ్యులు దాసరి రమాదేవి,పంతంగి రమేష్, గట్టిగుండ్ల యాదమ్మ, పర్లగొర్ల నాగమ్మ,అంతటి రమేష్, బెల్లి గంగమ్మ ఉన్నారు.మిగతా ఐదుగురు వార్డు సభ్యులు గైర్హాజరయ్యారు.అవిశ్వాసంతో శివాజీ పదవి కోల్పోయినట్టు ఆర్డీఓ ప్రకటించారు.ఎన్నికల నిబంధన ప్రకారం తిరిగి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నూతన ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుందని ప్రకటించారు.ఈకార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ ప్రదీప్‌కుమార్ డిప్యూటీ తహసీల్దార్ మురళీమోహన్, ఎంపీఓ బొమ్మ సత్యనారాయణ పాల్గొన్నారు.
భారీగా మోహరించిన పోలీసులు
ఏపీలింగోటం ఉపసర్పంచ్ శివాజీపై జరిగిన అవిశ్వాసంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నార్కట్‌పల్లి ఎస్సై భీమనబోయిన యాదయ్య, చిట్యాల ఎస్ఐ నాగరాజు, మునుగోడు ఎస్సై రజినికర్‌రెడ్డి పాల్గొన్నారు.