Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-డిండి
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం మండల కేంద్రంలోని కమ్యూనిటీహాల్లో పార్టీ మండల ఏడో మహాసభ నిర్వహించారు.ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోడీ ప్రధాని అయినప్పటి నుండి ఇప్పటివరకు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను మూసి వేసి లాభాల బాట లో నడుస్తున్న పరిశ్రమలను చౌకధరలకు అమ్మివేశారని విమర్శించారు. కొత్త ఉద్యోగాలు కల్పించక పోగా ఉన్న ఉద్యోగాలను లేకుండా చేసి నిరుద్యోగ సైన్యాన్ని పెంచారని విమర్శించారు.వ్యవసాయ వ్యతిరేక చట్టాలు, కార్మిక, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని 11నెలలుగా దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, ప్రజలు పోరాడుతున్నా మోడీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వాలపై పోరాడాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య, జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్, నాయకులు వెంకటయ్య, రుతమ్మ, రాములు, బుచ్చయ్య పాల్గొన్నారు.