Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణానికి చెందిన సిగ రవీందర్‌కు ఆచార్య విశ్వవిద్యాలయం గుంటూరు, ఆంధ్రప్రదేశ్ వారు ఎడ్యుకేషన్ విభాగంలో డాక్టరేట్ ప్రదానం చేశారు. హైదరాబాదులోని శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో ఉస్మానియా విశ్వ విద్యాలయానికి చెందిన శ్రీ మణాళిని ఆధ్వర్యంలో స్టడీ ఆఫ్ ది ప్రాక్టీస్ ఆఫ్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ ఆఫ్ శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ అనే అంశంపై పరిశోధన చేశారు.రవీందర్ హైస్కూల్ విద్య జిల్లా పరిషత్ పాఠశాల సూర్యాపేటలో చదివారు. ఇంటర్,డిగ్రీ పట్టణంలోని రాజారాం జూనియర్, ఆర్కేఎల్ కే డిగ్రీ కళాశాలలో, బీఈడీ గోకుల్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ నల్లగొండలోఎన్ఏడి హైదరాబాదులోని ఎన్ఎస్ఆర్ కళాశాల యందు చదివి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో ఎమ్మెస్సీ సైకాలజీ చదివారు.హైదరాబాద్‌లోని ఐన్‌స్టీన్ బీఈడీ కళాశాలలో మనో విజ్ఞానశాస్త్ర అధ్యాపకునిగా పనిచేసి విద్యార్థులు ఆదరాభి మానాలను పొందారు. హయత్ నగర్‌లోని గాంధీయన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ప్రిన్సిపాల్‌గా సూర్యా పేటలోని ఎంఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ప్రిన్సిపాల్‌గా పని చేశారు.ఓ దినపత్రికలో డీఎస్సీకి సంబంధించిన సైకాలజీ కాలమ్స్ని క్యాంపస్ పబ్లికేషన్ పేరుతో తొలిసారి ఎంఈడీ ఎం ఫ్రెండ్స్‌కు పుస్తకాన్ని ప్రచురించారు.సాహిత్యంపై మక్కువ ఉన్న రవీందర్ వివిధ మేగజైన్లలో కవితలు కూడా రాశారు.విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష యూజీసీ నెట్ లో సెట్ విద్యా విభాగంలో మంచి ర్యాంకు సాధించారు.నిత్య విద్యార్థిగా ఉండే అతను ఎమ్మెస్సీ సైకాలజీ, ఎంఈడీ ఎం ఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్,పీజీడీఈఎల్టీ, ఎంఏ సోషి యాలజీ డిస్ట్రక్షన్ వంటి కోర్సులు కూడా అభ్యసించారు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి వ్యాసాలు కూడా ప్రచురిం చారు.పలు జాతీయ అంతర్జా తీయ వెబ్‌నార్, సెమినార్లో పాల్గొన ేవారు. ప్రస్తుతం తెలంగాణ విశ్వ విద్యాలయం డిపార్టుమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సారంగపూర్ నిజామాబాద్ యందు సహాయక ఆచార్యులు (కాంట్రాక్టు)గా పని చేస్తున్నారు.వీరికి డాక్టర్ లభించడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు, ప్రముఖులు అభినందించారు.