Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి
నవతెలంగాణ- నల్లగొండ
భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కనగల్ మండలం జి.యడవల్లి గ్రామంలో 43 ఎకరాల పట్టా భూములను మెగా పల్లె ప్రకతి పేరుతో ప్రభుత్వం అక్రమంగా లాక్కోవడంతో రోడ్డున పడ్డ రైతులు, బాధితులతో ముచ్చటించి వివరాలు సేకరించారు. పల్లె ప్రగతి పేరుతో నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగొని శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు పొతెపాక సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.