Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరి రూరల్
నవంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల జూనియర్ కం సబ్ జూనియర్ మెన్‌ను హాకీ టోర్నమెంట్ జిల్లా కేంద్రంలోని న్యూ డైమెన్షన్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కె.ధనంజ నేయులు తెలిపారు.సోమవారం హాకీ టోర్నమెంట్ లోగోను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్‌ను హాకీ అసోసియేషన్ తరుపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ముఖేష్ కుమార్, జిల్లా హాకీ సమాఖ్య అధ్యక్షుడు కిరణ్ కుమార్, హాకీ ట్రెజరర్ భాస్కర్ రెడ్డి, హాకీ కోచ్ దశరథ, ఉమ్మడి నల్గొండ జిల్లా హాకీ సెక్రెటరీ కరీం, సభ్యులు మల్లేష్, మనీ, శోభారాణి , అనిత పాల్గొన్నారు.