Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
గీత పారిశ్రామిక సహకార సంఘం ఆలేరు పాలకవర్గం ఎన్నికలు మండల కేంద్రంలో సోమవారం గౌడ సంఘం నూతన భవన ఆవరణలో ప్రశాంతంగా జరిగాయి. సహకార శాఖ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి ఎన్నికలను పరిశీలించారు గణగాని శంకర్ గౌడు ఫ్యానల్లో డైరెక్టర్లు మేజరిటి విజయం సాధించారు . డైరెక్టర్లుగా గణగాని నర్సింహులు గౌడ్, గణ గాని రాము, గణగాని శంకర్ గౌడ్, గణగాని మహేష్ గౌడ్, మోరిగడి బాలరాజు గౌడ్, మొరిగడి విద్యా సాగర్ గౌడ్,మహిళా సభ్యులు సీసా మహేశ్వరి ,దూడల స్వాతి గెలుపొందారు. మొరిగాడి చంద్రశేఖర్ ఫ్యానల్లో ఏకైక సభ్యుడు మొరిగాడి చంద్రశేఖర్ గెలుపొందారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఘనగాని శంకర్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఫ్యానల్ డైరక్టర్లను తనను గెలిపించిన గీత కార్మిక సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ,మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో సంఘం అభివద్ధికి పాటుపడ్తానన్నారు. ఏఎస్ఐ మోహన్ , కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఇతర పోలీస్ సిబ్బంది ,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.