Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో వందశాతం వ్యాక్సిన్ పూర్తిచేసుకున్న సందర్భంగా సోమవారం ఆ గ్రామ మాజీ సర్పంచ్ రమణగోని శంకర్ ఆధ్వర్యంలో డాక్టర్లు, ఎఎన్ఎంలను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కరోనాను రూపుమాపవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండమీది మల్లేశం, డాక్టర్లు యశోద, శతి, హర్ష, శివప్రసాద్‌రెడ్డి, మనోహర్, వసంత, సత్యనారాయణ, ఎఎన్ఎంలు ఝాన్సీ, సువార్త, మౌనిక, నాయకులు దూడల బిక్షంగౌడ్, గుజ్జుల సురేందర్‌రెడ్డి, దాసోజు బిక్షమాచారి, రిక్కల సుధాకర్‌రెడ్డి, రమణగోని దీపిక, కడారి అయిలయ్య, కల్పన, పిల్ల బుచ్చయ్య, ఊదరి రంగయ్య, బాతరాజు లింగస్వామి, గణేశ్, పర్నె శేఖర్‌రెడ్డి, కొండపురం దుర్గయ్య పాల్గొన్నారు.