Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే :
మండలాధ్యక్షుడు మందడి ఉదరురెడ్డి
నవతెలంగాణ- రామన్నపేట
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న క్రమశిక్షణా చర్యల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు రామన్నపేట ఎంపీటీసీ ఎండి.రెహాన్‌ను టీిఆర్‌ఎస్ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ మండల అధ్యక్షుడు మందడి ఉదరు రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ విశ్రాంతి భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం కాకుండా అధికారులను బెదిరించడం, భయపెడుతూ దురుసుగా ప్రవర్తిస్తూ అధికార పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని తెలిపారు. ఎంపీపీ, జడ్పిటిసి ఇతర ప్రజాప్రతినిధుల పట్ల కూడా అమర్యాదగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తుండడంతో, ఆయన చర్యల వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పార్టీ నుండి సస్పెండ్ చేశామని తెలిపారు. అనేకమార్లు నచ్చచెప్పినా వైఖరిలో మార్పు రాకపోవడం మూలంగానే, పట్టణ మండల టీఆర్ఎస్ నాయకుల కార్యకర్తల, ప్రజాప్రతినిధుల ఏకగ్రీవ తీర్మానంతో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు తిమ్మాపురం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆయన తీరులో మార్పు రాకపోవడంతో పాటు ఆయన ప్రవర్తన సభ్యులకు అవమాన కరంగా ఉందని, దీంతో పార్టీ నిర్ణయం తీసుకుందని దాన్ని సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్టీ మండల అధ్యక్షులు నంద్యాల బిక్షం రెడ్డి, నాయకులు పున్న జగన్మోహన్, కన్నెబోయిన బలరాం, ప్రధాన కార్యదర్శి పోచ బోయిన మల్లేశం, పట్టణ అధ్యక్షుడు పోతరాజు సాయికుమార్, ఎంపీటీసీ గొరిగే నరసింహ, సర్పంచులు గు త్తా నరసింహారెడ్డి, అప్పం లక్ష్మీ నర్స్, ఉప సర్పంచ్ పొడిచేటి కిషన్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి ఆమెర్, కూనూరు ముత్తయ్య, బడుగు రఘు, అంతటి రమేష్, ఎండి నాసర్, బొక్క మాధవ రెడ్డి, బండ శ్రీనివాస్ రెడ్డి, బొలుగుల కష్ణ, అనంత కుమార్, గంగాపురం సైదులు, బొడ్డు ఆల్లయ్య, కందుల అంజయ్య, ఆముద లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.