Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే కిషోర్‌కుమార్
నవతెలంగాణ - తుంగతుర్తి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని సంగెం గ్రామంలో సర్పంచ్ ఏశమల్ల సుశీల సామెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దీపికా యుగేందర్‌రావు, ఎంపీపీ గుండగాని కవితా రాములుగౌడ్, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలంయాదవ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ పులుసు యాదగిరి, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు నల్లు రాంచంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు పోగుల శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ ఏశమల్ల సుశీల సామెల్, ఎంపీటీసీ కలకోట్ల ఏలేజర్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు మల్యాల రాములు, గ్రంథాలయ చైర్మెన్ గోపగాని రమేష్‌గౌడ్, సర్పంచులు లకావత్ యాకు నాయక్, గుగులోత్ ఈరోజి తదితరులు పాల్గొన్నారు.