Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరి రూరల్
పట్టణంలోని వాత్సల్య కళాశాల క్యాంపస్లో స్వాగత వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మెన్ దరిపల్లి నవీన్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి , మాట్లాడారు. టైమ్ మేనేజ్మెంట్ నిర్వహించుకుని, పట్టుదలతో విజయాన్ని సొంతం చేసుకోవాలని సూచించారు. కళాశాల సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థుల పట్ల స్నేహపూర్వక భావంతో వారికి మార్గనిర్దేశం చేయాలన్నారు. కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్దులు శ్రద్ధగా చదువుకావాలని, మంచి ఉతీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు చేసిన నత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సురేష్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అధ్యాపకులు వెంకటేశ్వర్లు, ఇంతియాజ్, శ్రీనివాస్, లావణ్య, ఉదయశ్రీ, సువర్ణ రాణి, వెంకట్ రెడ్డి, అర్జున్, రణధీర్, నరేందర్ రెడ్డి, సుమన్, సంధ్య, గోపాలకష్ణ పాల్గొన్నారు.