Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు
కొందరి కుట్రలో భాగమే సస్పెన్షన్
ఎంపీటీసీ రెహాన్
నవతెలంగాణ -రామన్నపేట
మండల ప్రజా పరిషత్ రూ.24 లక్షల జనరల్ ఫండ్‌కు సంబంధించిన లెక్కలు అడిగినందుకు టీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేస్తారా అని ఆ పార్టీ నుండి సస్పెండ్‌కు గురైన స్థానిక ఎంపీటీసీ ఎండి,రెహాన్ మహమ్మద్ ప్రశ్నించారు. సోమవారం స్థానికంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 24 లక్షల జనరల్ పండ్ లెక్కలతో పాటు గ్రామపంచాయతీ నుండి వసూలు చేస్తున్న 10శాతం నిధుల వివరాల లెక్కలు అడిగానని వాటిని అధికారులు చెప్పకుండా దాటవేస్తున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీల నుండి వసూళ్లు సరిగా లేవని కొందరు ఇస్తున్నారు ఇవ్వడం లేదని అంటున్నారు తప్ప సమగ్ర వివరాలు ఇవ్వడంలేదని, అధికారులను ప్రశ్నిస్తే ఇలాంటి చర్యలు తీసుకుంటారా అన్నారు. ఏ ఒక్క రోజు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, పాల్పడినట్లు రుజువులు చూపాలని డిమాండ్ చేశారు. కొందరి కుట్రలో భాగమే ఈ చర్య అని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి ప్రజా ప్రతినిదిని అయ్యానని ప్రజల నిధులు ప్రజలకు అందాల్సిన అవసరముందని తెలిపారు.