Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేటరూరల్
వేసంగి వరి పంట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఈ సారి యాసంగిలో వరి పంట వేసుకోవద్దని జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు పలు రకాలుగా ప్రకటనలు చేస్తున్నారని, ఫలితంగా రైతులు గందరగోళ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంట వద్దు అంటున్న ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు ఎందుకు నిర్మిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు, రైతు సంఘం జిల్లా నాయకులు మందడి రామ్‌రెడ్డి, కొప్పుల రజిత, పందిరి సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మండల్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, కోట పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.