Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి
నవతెలంగాణ - సూర్యాపేట కలెక్టరేట్
ప్రతి నెలా 30వ తేదీన పౌర హక్కుల దినోత్సవాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావుకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. కులవివక్ష, అంటరానితనంపై అవగాహన కల్పించడం కోసం నెలలో ఒకరోజు నిర్వహించే పౌర హక్కుల దినోత్సవం జిల్లాలో సక్రమంగా అమలు కావడం లేదన్నారు. ఇటీవలే జరిగిన దసరా, బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో దళితులు కుల వివక్ష, అంటరానితనానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్తే బెదిరించి కేసు రాజీ చేయించి పంపించేస్తున్నారన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో జిల్లా నాయకులు కొండేటి ఉపేందర్, వడిగ శ్రీరామ్, అజరు, రమేష్ తదితరులు ఉన్నారు.