Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేట
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో మెట్రో ఆస్పత్రి పక్కన ఏర్పాటు చేసిన శ్రీ తేజ కెనెటిక్ ఎలక్ట్రిక్ వాహనాల షోరూంను ప్రారంభించి మాట్లాడారు. ఈ వాహనాల వాడకంతో కాలుష్య రహిత సమాజం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమళ్ల అన్నపూర్ణ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వర్లు, ఉప్పల ఆనంద్, కౌన్సిలర్లు కక్కిరేని శ్రీనివాస్, ఎలిమినేటి అభినరు, నాయకులు రాపర్తి మహేష్‌కుమార్, చల్లా లక్ష్మికాంత్, లక్ష్మిప్రసాద్, సూర్యాపేట డీలర్ నాయిని రాంప్రసాద్, ఉమ్మడి నల్లగొండ డీలర్ చేను సురేష్, తుపాకుల జానికీ రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.