Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
అమరులైన విప్లవ యోధుల ఆశయాలను ప్రతి ఘటన పోరాటాల ద్వారానే సాధించగలమని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్ ,డివిజన్ కార్యదర్శి బేజడి కుమార్ అన్నారు. సోమవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. అమరవీరులు పొట్ల రామనర్సయ్య, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి,దేవులపల్లి వెంకటేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వరరావు, సత్యనారాయణ సింగ్, కొల్లా వెంకయ్య, నీలం రామ చంద్రయ్య, జేసీసీ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి,పూనేం లింగన్న, ఎల్లన్న, విక్రమన్న, రాయల సుభాష్ చంద్ర బోస్,జలగం జనార్ధన్ వీరోచితంగా పోరాడి ప్రజల పక్షాన నిలిచారన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐకెఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డొంకెన శ్రీహరి, సుంచు యాకుబ్, పి.సుదర్శన్, బర్మబాబు, ఇక్కిరికుమార్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.