Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
తమది రైతు అనుకూల ప్రభుత్వమని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.మంగళవారం కనగల్ మండలంలోని వేమిరెడ్డిగూడెం,దోరేపల్లి, పగిడిమర్రి, శాబ్దుల్లాపురం, రేగట్టె, కురంపల్లి, పోనుగోడు,రామచంద్రాపురం, జీ.యడవెల్లి, మదనపురం, బోయినపల్లి, బుడమర్లపల్లి, లచ్చుగూడెం, పర్వతగిరి గ్రామాల్లో ధాన్యం కొనుగోలుకేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.ఈ యాసంగిలో వరికి బదులుగా వాణిజ్య పంటలు సాగు చేసుకోవాలన్నారువాణిజ్య పంటల సాగులో కూడా దేశంలో నెంబర్‌వన్ కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించేందుకు ప్రయత్నిస్తుందని,బీజేపీ నాయకులు దీనికి వ్యతిరేకంగా ధర్నా చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటేశం, ఎంపీపీ కరీంపాషా, వివిధ గ్రామాల సర్పంచులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.