Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవరకొండ :ఈ నెల ఒకటిన మధ్యాహ్నం సుమారు 12 గంటల మయంలో కల్వకుర్తి-మల్లేపల్లి హైవేపై అనుమతుల్లేకుండా ధర్నా నిర్వహించి ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కల్గించిన సుమారు 20 మందిపై ఫొటో, వీడియో ఆధారంగా క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బీసన్న తెలిపారు. కల్వకుర్తి-మల్లేపల్లి నేషనల్ హైవే -167పై ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతులు లేవని, దీనిని ప్రజలు అందరు గమనించాలన్నారు.అకారణంగా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ధర్నాలు నిర్వహించడం వలన సామాన్య ప్రజానీకానికి, అంబులెన్సు, ఫైర్ లాంటి అత్యవసర సేవలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందన్నారు.