Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
అసంఘటిత రంగ కార్మికులతో ఇన్సూరెన్స్ చేయించాలని మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్ కోరారు. మంగళవారం రీసోర్స్ పర్సన్లతో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు.కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ శ్రమ కార్డును రూ.12 పెట్టి తీసు కున్నట్టయితే రూ.2లక్షల ఇన్సూ రన్స్ వర్తిస్తుందన్నారు. పట్టణ ంలో అసంఘటితరంగ కార్మికులను గుర్తించి వారిచే ఇన్సూరెన్స్ కల్పించా లన్నారు. ప్రధానమంత్రి ఫైనాన్స్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ద్వారా మహిళాసంఘంలోని వ్యక్తిగత ఉత్పత్తులను తయారు చేసే ప్రతిభా వంతులను గుర్తించి వారిచే పీఎంఎఫ్ఎంఈ ద్వారా అప్లై చేస్తే వారికి రూ.40 వేలు ఎస్ఎల్ఎఫ్ ద్వారా మంజూ రవుతాయన్నారు.ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్ర మంలో మున్సిపల్ కమిషనర్ రవీందర,్ సాగర్, మెప్పా టీఎంసీ బక్కయ్య, సీఈఓలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రీసోర్స్పర్సన్స్ పాల్గొన్నారు.