Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాలియా
రైతులకు అసౌకర్యం, ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే నోముల భగత్ ఆదేశించారు.మంగళవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో రైస్ మిల్లర్స్, రెవెన్యూ, సివిల్ సప్లై, పోలీస్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. రైస్ మిల్లర్లు, రైతుల మధ్య సమన్వయాన్ని కొనసాగించాలని సూచించారు.అన్నదాతలు సమన్వయాన్ని పాటించి వారి ధాన్యాన్ని అమ్ముకోవాలని కోరారు.తేమ శాతం కూడా పాటించి ధాన్యాన్ని మిల్లుల వద్దకు తీసుకురావాలన్నారు. రైస్ మిల్లుల వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.ఈ సమావేశంలో డీఎస్వో వెంకటేశ్వర్లు, డీఎం నాగేశ్వర్రావు, ఏడీఎం శ్రీకాంత్, ఏడీ జగదీశ్వర్ రెడ్డి, జిల్లా రైస్‌మిల్లు అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి, జనరల్ సెక్రెటరీ బాలకష్ణ, తహసీల్దార్ మంగ, ప్రమీల, అగ్రికల్చర్ ఏవో సంతోషి, సీఐ రాఘవులు, ఎస్ఐలు శివకుమార్, సైదులు, మార్కెట్ చైర్మెన్లు నీలిమా మహేందర్‌రెడ్డి, కామెర్ల జానయ్య, పీఏసీఎస్ చైర్మెన్ రిక్కల మధు, మున్సిపల్ చైర్మెన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, మార్కెట్ వైస్‌చైర్మెన్ గుండాల రవి, పీఎసీఎస్ జిల్లా డైరెక్టర్ విరిగినేని అంజయ్య, త్రిపురారం సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు రఘురాంరెడ్డి, అక్బర్‌ఖాన్, కొట్టె రమేష్, ఆవులసైదులు, కౌన్సిలర్ నల్లబోతు వెంకటయ్య, కోఆప్షన్‌సభ్యులు చాపల సైదులు, మండలఅధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణఅధ్యక్షుడు చెరుపల్లిముత్యాలు, మండల ప్రధానకార్యదర్శి ఎనమల సత్యం, సురభి రాంబాబు, రావులభిక్షం, దుండిగల శ్రీను, మార్కెట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.