Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ.53 వేల నగదు, 15 తులాల వెండి, సెల్‌ఫోన్ అపహరణ
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
సినీఫక్కీలో చోరీ జరిగిన సంఘటన మంగళవారం దేవరకొండ పట్టణంలోని సాగర్‌రోడ్డులో గల సెంట్రల్‌బ్యాంకులో చోటుచేసుకుంది.ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..నాంపల్లి మండలం దేవత్‌పల్లి గ్రామానికి చెందిన మారుపాక బుచ్చమ్మ,ధనమ్మ మహిళా సంఘం లోన్ డబ్బులు డ్రా చేసేందు కోసం మంగళవారం మధ్యాహ్నం కొండమల్లేపల్లి పట్టణంలోని సాగర్‌రోడ్‌లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్‌కు వచ్చారు. బ్యాంకులో రూ.1.50 లక్షలు డ్రా చేసుకుని పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ నందు నడుచుకుంటూ వెళ్తుండగా బుచ్చమ్మ చేతిలో ఉన్న డబ్బుల సంచిని వెనక నుండి వచ్చిన దుండగుడు లాక్కెళ్లాడు.అందులో మహిళా సంఘం డబ్బులు రూ.1.50లక్షలు, మరో మూడువేల నగదు, 5 తులాల వెండి,పట్టాగొలుసులు, సెల్‌ఫోన్, బ్యాంక్ పాసుబుక్కులు ,ఆధార్‌కార్డు సైతం ఉన్నాయి.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.