Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంజీయూ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
బీఈడీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల వేతనాలను ఆన్లైన్ ద్వారా అకౌంట్లో జమ చేయాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి అన్నారు.మంగళవారం మండలంలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో బీఈడీ కళాశాలల కరస్పాండెంట్‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.బీఈడీ కళా శాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల వేతనాలను ఆన్లైన్ ద్వారా వారి అకౌంట్లో వేయాలన్నారు.వారి సేవలను విశ్వవిద్యాలయం మూల్యాంకనం ,ఇతర పరీక్షల డ్యూటీ సభను నిర్వహించి,వారి పేర్లను విశ్వవిద్యాలయం వద్ద యాజమాన్యాలు ధవపర్చు కోవాలన్నారు.ధృవీకరించబడ్డ అధ్యాపకులను మాత్రమే పరీక్షల డ్యూటీలలో తీసుకుంటా మన్నారు.ఎట్టిపరిస్థితుల్లోనూ మిగతావారు అనుమతించమన్నారు.వేతనాలను కొన్ని నెలలే చెల్లిస్తున్నారని తరచుగా ఫిర్యాదులు అందుతు న్నాయని, ఈ ఫిర్యాదులు అందకుండా యాజ మాన్యాలు చూసుకోవాలన్నారు. యాజ మాన్యాలు జీతాలను వెంటనే ఆన్లైన్ ద్వారా చెల్లింపుల ప్రక్రియను చేపట్టాలని కోరారు.ఇదే రకమైన ఫిర్యాదులు భవిష్యత్‌లో రావొద్దని వచ్చినచో వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు.ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.విష్ణుదేవ్, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ ఎం.వసంత, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామచందర్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ మిరియాల రమేశ్, బీఈడీ కళాశాలల యాజ మాన్యాలు మహిపాల్‌రెడ్డి, ఖలీల్, జబ్బార్, సందీప్‌రెడ్డి, ప్రభుత్వ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్‌మునాఫ్ పాల్గొన్నారు.