Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ధాన్యాన్ని అమ్ముకునే రైతులకు టోకెన్లు వెంటనే ఇవ్వాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.మంగళవారం ఆయన మిల్లుల వద్ద ధాన్యం అమ్ముకునే రైతుల కష్టాలను నేరుగా తెలుసుకున్నారు.అనంతరం మాట్లాడుతూ మిర్యాలగూడ ప్రాంతంలో అధికంగా రైస్‌మిల్లులు ఉండడం వల్ల ఎక్కువమొత్తంలో ధాన్యపురాశులు ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు. రోజుకు 10 నుంచి 15 వేల ట్రాక్టర్ల ధాన్యం వస్తుందన్నారు.ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందన్నారు.అధికారులు తీసుకువచ్చిన టోకెన్ల పద్ధతి రైతులకు మరింత ఇబ్బంది పడే ఈ విధంగా ఉందని టోకెన్ల కోసమే రోజుల తరబడి పనులు మానుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మండలాల వారీగా టోకెన్ల జారీ ప్రక్రియ ఉంచడం వల్ల ఆ మండలంలో ఉన్న రైతులందరూ టోకెన్ల కోసం ఒక్కసారిగా వస్తున్నారన్నారు.రోజంతా క్యూలో నిలబడిన టోకెన్లు అందడం లేదన్నారు. అలా కాకుండా ఆయా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదిక క్లస్టర్ల, గ్రామ పంచాయతీ వారీగా టోకెన్లు జారీ చేస్తే రైతులకు ఇబ్బందులు తప్పుతాయన్నారు