Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఏకరూప దుస్తులను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ఒక్కొక్కరికి రూ.500 నగదు పంపిణీ చేస్తానన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కరోనా మహమ్మారి సమయంలో కార్మికులు చేసిన సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ అంకుశవలి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.