Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
ప్రారంభించిన ధాన్యం కేంద్రాలలో కొనుగోలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందాల ప్రమీల డిమాండ్ చేశారు.మంగళవారం స్థానిక నర్రా రాఘవరెడ్డి భవనంలో ఆ పార్టీ పట్టణ కమిటీ సమావేశం బహురోజు ఇందిరా అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి సుమారు 20 రోజులవుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రారంభించిన కేంద్రాల్లో ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలన్నారు.అకాల వర్షాలకు తడిసిన ధాన్యానికి మద్దతుధర చెల్లించాలన్నారు.యాసంగిలో వరి సాగు చేయొద్దన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి వంటెపాక వెంకటేశ్వర్లు, ప్రతినిధులు చెన్నబోయిననాగమణి, ఏర్పుల తాజేశ్వర్, వంటెపాక కృష్ణ, కంబాలసోమయ్య, పన్నాల శశికళ, కొత్త రాజేశ్వరి పాల్గొన్నారు.
.