Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ-దేవరకొండ
పట్టణంలో కాంతివంతమైన వెలుగులతో అభివద్ధిలో ముందుకెళ్తుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.మంగళవారం పట్టణంలో సెంట్రల్‌లైటింగ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.గతంలో మీనాక్షిసెంటర్ నుంచి డిండి రోడ్డు ఎల్ఐసీ ఆఫీస్ వరకూ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. పట్టణాలలో వెలుగులు విరాజిల్లు తున్నాయని తెలిపారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మారుస్తా నన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ అల్లంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, జెడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్, రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కష్ణయ్య, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు టీవీఎన్.రెడ్డి, పున్న వెంకటేశ్వర్లు, వైస్‌చైర్మెన్ రహత్‌అలీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్‌గౌడ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేములరాజు, పొన్నబోయినసైదులు, వడిత్య దేవేందర్, తౌఫిక్ ఖాద్రీ, మూడావత్ జయప్రకాష్ నారాయణ, పున్న శ్రీనివాస్, మహమ్మద్ రైస్, బొడ్డుపల్లి కష్ణ, జానిబాబా, ఇలియాస్ పటేల్, బాబా, సయ్యద్, అథిక్, సోఫీ, నల్లగాసు సత్యనారాయణ, సత్యం పాల్గొన్నారు.