Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
దళితుల సమస్యలను పరిష్కరించాలని కేవీపీ ఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.మంగళవారం ఈ విషయమై జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ నాగార్జునరెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళితబంధుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో అమలు చేయాలని కోరారు.ఎస్సీ. ఎస్టీ కమిషన్ చైర్మెన్‌ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేదన్నారు.ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని చెప్పిందని, జిల్లాలో ఏడేండ్లకాలంలో కాలంలో ఇచ్చింది శూన్యమని విమర్శించారు.పల్లెప్రకతివనం ఇతర అవసరాల కోసం అనేక గ్రామాలలో వందల ఎకరాల భూములను దళితుల నుంచి బలవంతంగా గుంజుకుందని విమర్శించారు.ఎస్సీ కార్పొరేషన్ రుణాలు 2019-20, 2020-21 రెండు సంవత్సరాల రుణాలు ఇవ్వలేదన్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎండమావిగా మారాయని విమర్శించారు.సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కుల వివక్ష,అంటరానితనం రూపుమాపాలని జస్టిస్ పున్నయ్య కమిషన్ 42 జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీహాస్టళ్లలో విద్యార్థులకు పెరిగిన ధరలక నుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలని కోరారు. దళితులు అత్యధికంగా ఉన్న మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసవేతనం అమలు చేయాలనారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం పట్టణకార్యదర్శి గాదె నర్సింహ,మండల కార్యదర్శి బొల్లు రవీందర్, సతీష్, బొంగరాల ఎల్లయ్య పాల్గొన్నారు.
ఎస్సీ,ఎస్టీ రాష్ట్ర కమిషన్‌కు చైర్మెన్‌ను నియమించాలి
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి
సూర్యాపేట :ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్‌కు చైర్మెన్‌ను నియమించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు చైర్మెన్ లేక అది తల లేని మొండెంగా తయారైందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టేకుల సుధాకర్, జిల్లా నాయకులు కొండేటి ఉపేందర్, జి.రమేష్, జై తదితరులు పాల్గొన్నారు.