Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతెపల్లి
ఈ నెల 17,18,19వ తేదీల్లో నిర్వహించనున్న సీపీఐ(ఎం) జిల్లా 20వ మహాసభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందాల ప్రమీల కోరారు. మంగళ వారం మహాసభ కరపత్రాన్ని ఆమె విడుదల చేసి మాట్లాడారు. 17న జరిగే బహిరంగ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. బహిరంగసభలో పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాంఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరు కానున్నట్టు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్నవెంకులు,మండల కార్యదర్శి చింతపల్లి. లూర్దుమారయ్య, కోటలింగయ్య, ఆదిమల్లసుధీర్, వీరబోయిన చౌడయ్య,అవ్వారి కిరణ్కుమార్ పాల్గొన్నారు.
విద్యావాలంటీర్కు విరాళంగా వేతనం అందజేత
నవతెలంగాణ-నార్కట్పల్లి
మండల పరిధిలోని అక్కెనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కొరత ఉండడంతో పాఠశాల విద్యా కమిటీ, గ్రామస్తులు విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేశారు.పాఠశాలలో విద్యా వాలం టీరీ విధులు నిర్వహిస్తున్న పావనికి ఆ గ్రామ మాజీ ఎంపీ టీసీ, కాంగ్రెస్ జిల్లా నాయ కులు కొమ్ము యాదయ్య తన వంతు సహకారంగా రూ.5 వేలు అక్టోబర్ మాసం వేతనాన్ని అందజేసి ఉదారస్వభావాన్ని చాటుకున్నారు.జనవరిలో సైతం రూ.5 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు.విద్యాభివద్ధి కోసం తన సొంత డబ్బును వేతన రూపంలో ఇవ్వడం పట్ల ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇద్దయ్య కతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తుల సహకారంతో మెరుగైన విద్యనందించేందుకు కృషి చేస్తామన్నారు.