Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-పెన్పహాడ్
ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి విమర్శించారు. మంగళవారం మండలంలోని భక్తలాపురం గ్రామంలో గుంజ వెంకటేశ్వర్లు, నెమ్మాది లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ 7వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్ల హామీ ఏమైందని ప్రశ్నించారు. కార్మిక, రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శిగా రణపంగ కృష్ణను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ధనియాకుల శ్రీకాంత్, కోట గోపి, వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, ఇరుగు రమేష్, నెమ్మాది పీరయ్య, గ్రామ ఉప సర్పంచ్ సుజాతసైదులు, ఆడిమయ్య, తదితరులు పాల్గొన్నారు.