Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిటౌన్
చేనేత వృత్తి, నేతన్నల జీవన విధాన ఇతివృత్తమే తమాసోమా జ్యోతిర్గమయా చిత్రమని డీసీసీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఓంకార్ థియేటర్లో కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రాన్ని నిర్మించింది పోచంపల్లి వాస్తవ్యుడు తడ్కా రమేష్ ,నిర్మాత ,దర్శకుడు బడుగు విజరు కుమార్ అని తెలిపారు. ఇలాంటి మంచి సినిమాని తీసి నేతన్నల జీవితాన్ని తెర పైన ఆవిష్కరించిన టీం మొత్తానికి కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో ఆనంద్. హీరోయిన్ రిషిక, బీసుకుంట్ల సత్యనారాయణ. కౌన్సిలర్స్. వెంకటేష్ , జగన్. సలుద్దీన్. గంగ. కష్ణ యాదవ్. కోట స్వామి. బింగి బిక్షపతి.చిక్క వెంకటేష్.సత్తి రెడ్డి. ఆదినారాయణ. మజార్. అవైస్. కూర వెంకటేష్. చిక్కుల వెంకటేష్. తదితరులు పాల్గొన్నారు.