Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఏసీఎస్ చైర్మెన్ జంగారెడ్డి
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
ధాన్యాన్ని ఆరబెట్టుకోని కొనుగోలు కేంద్రానికి తీసుకురా వాలని పీఏసీఎస్ చైర్మెన్ జక్కిడి జంగారెడ్డి రైతులను కోరారు. ఆ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఆయన ఎంపీపీ ఉమా ప్రేమ్ చందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ 17 శాతం ఉండాలని, ధాన్యం తాలు లేకుండా తీసుకురావాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బచ్చన గోనిగాలయ్య, సింగిల్విండో చైర్మెన్ లచ్చి రామ్ నాయక్, డైరెక్టర్లు బొడ్డు పెళ్లి గాలయ్య, ఉప్పల కష్ణ అంజయ్య ,పెంటయ్య, నరసింహ , బానోతు కిషన్ ,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు యాదిరెడ్డి చండూర్ మార్కెట్ డైరెక్టర్ బాలునాయక్ డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ నగేష్, కష్ణ, తదితరులు పాల్గొన్నారు.