Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కృష్ణ
నవతెలంగాణ -భువనగిరిరూరల్
రాష్ట్ర ప్రభుత్వం దళితులను అన్నిరకాలుగా అభివద్ధికి దూరం చేసిందని , ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను నియమించాలని కేవీపీ ఎస్ జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కృష్ణ డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు రాష్ట్రమంతా అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుగ్గ నవీన్, ఆ సంఘం జిల్లా ఉపాధక్షులు నిలిగొండ కిశోర్, మండల నాయకులు శ్రీకాంత్ ఉన్నారు.