Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తుంగతుర్తి
ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్‌కు చైర్మెన్‌ను నియమించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సీనియర్ అసిస్టెంట్‌కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. దళితులు కుల వివక్ష, అంటరానితనానికి గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్వాయి పున్నయ్య, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.